కేన్స్‌ చిత్రోత్సవంలో టీజర్‌ లాంచ్‌

ABN , Publish Date - May 14 , 2024 | 12:22 AM

మంచు విష్ణు నటిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇందుకు తగ్గట్లే ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయంలో...

కేన్స్‌ చిత్రోత్సవంలో టీజర్‌ లాంచ్‌

మంచు విష్ణు నటిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇందుకు తగ్గట్లే ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయంలో చిత్ర బృందం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 20న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో విడుదల చేయబోతున్నారు. ‘వరల్డ్‌ ఆఫ్‌ కన్నప్ప’ పేరుతో రిలీజ్‌ కానున్న ఈ టీజర్‌ ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్‌ అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. కాగా, ఈ భారీ బడ్జెట్‌ ఫ్యాంటసీ డ్రామాను ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్నారు. మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌, మోహన్‌బాబు, శరత్‌కుమార్‌, శివ రాజ్‌కుమార్‌, అక్షయ్‌కుమార్‌, మోహన్‌ లాల్‌, ప్రభుదేవా వంటి స్టార్స్‌ కీలక పాత్రల్లో మెరవనున్నారు.

Updated Date - May 14 , 2024 | 12:22 AM