Venu Swamy: వేణుస్వామిని క‌లిసిన తంత్ర‌.. పూజ‌ల కోస‌మేనా!

ABN , Publish Date - Mar 12 , 2024 | 02:55 PM

టాలీవుడ్‌లో మ‌రో ముద్దుగుమ్మ వేణు స్వామిని ఆశ్ర‌యించింది. గ‌తంలో ర‌ష్మిక మంద‌న్నా, డింపుల్ హ‌య‌తి, నిధి ఆగ‌ర్వాల్, అషు రెడ్డి మ‌రో ఇద్ద‌రు ముగ్గురు క‌థానాయిక‌లు సెల‌బ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి వ‌ద్ద పూజ‌లు చేయించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆ కోవ‌లోకి మ‌ల్లేషం, వ‌కీల్ సాబ్ ఫేం ఆన‌న్య నాగ‌ళ్ల చేరింది.

Venu Swamy: వేణుస్వామిని క‌లిసిన తంత్ర‌.. పూజ‌ల కోస‌మేనా!
tantra

టాలీవుడ్‌లో మ‌రో ముద్దుగుమ్మ వేణు స్వామిని ఆశ్ర‌యించింది. గ‌తంలో ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandanna), డింపుల్ హ‌య‌తి (Dimple Hayathi), నిధి ఆగ‌ర్వాల్ (Nidhhi Agarwal ), అషు రెడ్డి (Ashu Reddy) మ‌రో ఇద్ద‌రు ముగ్గురు క‌థానాయిక‌లు సెల‌బ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి వ‌ద్ద పూజ‌లు చేయించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆ కోవ‌లోకి మ‌ల్లేషం, వ‌కీల్ సాబ్ ఫేం ఆన‌న్య నాగ‌ళ్ల (Ananya Nagalla) చేరింది. ఇప్పుడు ఈ అంశం సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.

GGxnQlRWAAAQC7i.jpeg

ఇప్ప‌టికే సెలబ్రిటీ జ్యోతిష్యుడు అని పేరు తెచ్చుకున్న‌ వేణు స్వామి (Venu Swamy) తో జ్యోతిష్యం చెప్పించుకోవ‌డానికి చాలామంది సినీ తార‌లు ప‌డి చ‌స్తున్నారు. వారితో పాటు ఫేజ్‌1 క‌ల్చ‌ర్ స‌ర్కిల్ ఇళ్లల్లో పూజ‌లు, యాగాలు నిత్య‌కృత్య మ‌య్యాయి. అఖ‌రికి వారు కొత్త‌గా కొనే వాహ‌నాల పూజ‌లు కూడా వేణు స్వామితోనే చేయిస్తున్నారంటే ఆయ‌న చేసే పూజ‌ల‌కు ఎంత డిమాండ్ ఉందో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. అయితే.. వేణు స్వామి త‌న ఇంటికి వ‌చ్చిన సెల‌బ్రిటీలు, సినిమా తార‌లతో బగ్లా ముఖి దేవి, రాజ శ్యామలా దేవీ, వామాచార పూజ‌లు చేస్తూ పేరు గ‌డించారు. ఆ మ‌ధ్య ఓ న‌టి పూజ‌లు చేస్తున్న స‌మయంలో అక్క‌డ వైన్ బాటిళ్లు క‌న‌బ‌డ‌డంతో వాటితో కూడా పూజ‌లు ఉంటాయా అనే అంశం నెట్టింట తెగ వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే..


ప్ర‌స్తుతం తెలుగులో స్టార్ క‌థానాయిక‌ల క‌న్నా, బ‌డ్జెట్‌తో సంబంధం లేకుండా ఎక్కువ‌గా సినిమాలు చేస్తున్న‌ ఏకైక న‌టి ఎవ‌రైనా ఉన్నారంటే 16 అనాల అచ్చ తెలుగ‌మ్మాయి అన‌న్య (Ananya Nagalla) పేరు త‌ప్ప‌క చెప్పాల్సిందే. నెల రోజుల‌క్రితం అన్వేషి అనే చిత్రం రిలీజ్ అవ‌గా ‘తంత్ర' (Tantra) అనే సినిమా మ‌రో రెండు రోజుల్లో మార్చి 15న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌, న‌వాబ్, ఓ త‌మిళ సినిమాతో పాటు బ‌హిష్క‌ర‌ణ అనే వెబ్ సిరీస్ విడుద‌ల కావాల్సి ఉన్నాయి.

ananya.jpeg

ఇదిలాఉండ‌గా.. ప్ర‌స్తుతం ‘తంత్ర' (Tantra) సినిమా ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉంటున్న అన‌న్య నాగ‌ళ్ల‌ స‌డ‌న్‌గా వేణు స్వామిని క‌ల‌వ‌డంతో ఈ క్ర‌మంలో ఆమె వేణు స్వామిని క‌ల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. ఈ తంత్ర సినిమా పూర్తిగా క్షుద్ర పూజ‌లు, తాంత్రిక విద్య‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన నేప‌థ్యంలో వాటి నుంచి ర‌క్ష‌ణ కోసం శాంతి పూజ‌లు చేయ‌డానికి వెళ్లిందా.. లేక సినిమా విజ‌య‌వంతం కోసం అశీర్వాదం తీసుకోవ‌డానికి వెళ్లిందా అనే విష‌యాలు తెలియాల్సి ఉంది. అమె పూజ‌లు చేసినట్టు ఎలాంటా ఫొటోలు బ‌య‌టికి రాకున్న‌ప్ప‌టికీ త‌మ సినిమా ప్ర‌మోష‌న్ కోసం ఆయ‌న‌ను క‌లిసిన‌ట్లు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

Updated Date - Mar 12 , 2024 | 02:55 PM