తండేల్‌ ప్రయాణం... కీలక ఘట్టం ముగిసింది

ABN , Publish Date - Feb 06 , 2024 | 01:17 AM

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్‌’. సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్‌ బేనర్‌పై బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు...

తండేల్‌ ప్రయాణం... కీలక ఘట్టం ముగిసింది

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్‌’. సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్‌ బేనర్‌పై బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు రియల్‌ లొకేషన్లలో షూటింగ్‌ చేస్తున్నారు. సుధీర్ఘ షెడ్యూల్‌ను యూనిట్‌ పూర్తి చేసింది. నాగచైతన్య, సాయిపల్లవి ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను యూనిట్‌ తెరకెక్కించింది. ఈ సందర్భంగా మేకర్స్‌ వర్కింగ్‌ స్టిల్స్‌ను విడుదల చేశారు. రాజు అనే మత్స్యకార యువకుడిగా నాగచైతన్య, అతని ప్రేయసి పాత్రలో సాయిపల్లవి కనిపించనున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్‌

Updated Date - Feb 06 , 2024 | 01:17 AM