తమిళ విజయ్‌ ఆఖరి చిత్రం ప్రారంభం

ABN , Publish Date - Oct 05 , 2024 | 04:43 AM

తమిళ హీరో విజయ్‌ ఇక నటనకు స్వస్తి పలికి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో ఆయన నటించే 69వ చిత్రం పూజా కార్యక్రమాలతో శుక్రవారం చెన్నైలో ప్రారంభమైంది.

[ { "id" : 6933, "articleText" : "

తమిళ హీరో విజయ్‌ ఇక నటనకు స్వస్తి పలికి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో ఆయన నటించే 69వ చిత్రం పూజా కార్యక్రమాలతో శుక్రవారం చెన్నైలో ప్రారంభమైంది. విజయ్‌కు ఇది ఆఖరి చిత్రమని చెబుతున్నారు. హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో వెంకట్‌ కె నారాయణ నిర్మిస్తున్నారు. సినిమాలో కథానాయికగా నటిస్తున్న పూజా హెగ్డే, విలన్‌ పాత్ర పోషిస్తున్న బాబీ డియోల్‌ తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. శనివారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది. గౌతమ్‌ వాసుదేవ మీనన్‌, ప్రకాశ్‌రాజ్‌. ప్రియమణి, మమిత బైజు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా తమిళ చిత్ర పరిశ్రమలో ఉంటూ తన విలక్షణమైన నటనతో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరిస్తున్న విజయ్‌ కెరీర్‌లో ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటున్న చిత్రమిదని దర్శకనిర్మాతలు చెప్పారు. అత్యంత భారీగా, తరాలు గుర్తు పెట్టుకునే విధంగా సినిమాను రూపొందిస్తామని తెలిపారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వచ్చే ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా రిలీజ్‌ చేస్తామని నిర్మాత వెంకట్‌ కె నారాయణ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌, ఫొటోగ్రఫీ: సత్యన్‌ సూర్యన్‌, ఎడిటింగ్‌: ప్రదీప్‌ రాఘవన్‌. యాక్షన్‌: అనల్‌ అరసు.

", "ampArticleText" : "

", "documentUpload" : { "id" : 0 }, "timestamp" : 1728083614079, "timestampSm" : "2024-10-05T04:43:34+05:30" } ]

Updated Date - Oct 05 , 2024 | 04:43 AM