తమిళ.. హిందీ భాషల్లో ఒకేసారి
ABN , Publish Date - Oct 24 , 2024 | 05:37 AM
డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గజనీ’ చిత్రం అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాను మొదట తమిళ్‌లో సూర్యతో తెరకెక్కించి.. ఆ తర్వాత తెలుగులోనూ...
డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గజనీ’ చిత్రం అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాను మొదట తమిళ్‌లో సూర్యతో తెరకెక్కించి.. ఆ తర్వాత తెలుగులోనూ డబ్ చేశారు. రెండు భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచిందీ చిత్రం. ఇదే చిత్రాన్ని.. నిర్మాతలు అల్లు అరవింద్, మధు మంతెన మాతృక దర్శకుడు మురుగదా్‌సతో.. హిందీలో ఆమీర్‌ఖాన్ హీరోగా ఒరిజినల్ టైటిల్‌తోనే రీమేక్ చేశారు. ఈ సినిమా అక్కడా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. తాజాగా, ఈ సినిమా సీక్వెల్ పనులు మొదలయ్యాయి. నిర్మాతలు అల్లు అరవింద్, మధుమంతెన రెండో భాగానికి అవకాశం ఉందని సూర్యకు.. ఆమిర్‌ఖాన్‌కు చెప్పడంతో ఇద్దరూ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందీ చిత్రం. వచ్చే ఏడాదిలో స్ర్కిప్టు పూర్తయ్యే అవకాశం ఉంది. స్ర్కిప్టు పనులు పూర్తయ్యాక.. తమిళంలో సూర్యతో.. హిందీలో ఆమిర్‌ఖాన్‌తో ఒకేసారి షూటింగ్‌ను ప్రారంభిస్తారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాను రెండు భాషల్లో ఒకేరోజు రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ‘దృశ్యం’ ఫ్రాంచైజీని కూడా ఇదే విధంగా మలయాళంలో.. హిందీలోనూ ఒకేసారి తెరకెక్కించాలని మేకర్స్ అనుకుంటున్నారు.