scorecardresearch

Tamannaah Bhatia: అదరగొట్టే అందంతో మిల్కీ బ్యూటీ పోజులు

ABN , Publish Date - Jun 25 , 2024 | 02:05 PM

తమన్నా భాటియా అటు హిందీలోనూ, ఇటు దక్షిణాదిలోనూ బిజీగా వున్న నటీమణుల్లో ఒకరు. కథానాయికగా కాకుండా తన పాత్రకి ప్రాధాన్యం వున్న సినిమాలు చేస్తుకుంటూ వెళుతున్న తమన్నా, తన తాజా ఫోటోలతో అభిమానుల గుండెలను కొల్లగొట్టింది.

Tamannaah Bhatia: అదరగొట్టే అందంతో మిల్కీ బ్యూటీ పోజులు
Tamannaah Bhatia

తెలుగు నటీమణుల్లో తమన్నా భాటియాని మిల్కీ బ్యూటీ అని కూడా అభిమానులు అంటూ వుంటారు. ఒక్క తెలుగులోనే కాకుండా, తమిళం, హిందీ భాషల్లో కూడా బిజీగా సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది తమన్నా.

ఈమధ్యనే 'బాక్' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్రర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకి సుందర్ సి దర్శకుడు, కథానాయకుడు కూడాను. సుందర్ చెల్లెలుగా తమన్నా నటించింది. తమన్న కథానాయిక పాత్రలకే కాకుండా, తనకి ప్రాధాన్యమున్న మంచి పాత్ర ఏదైనా చేస్తాను అనేట్టుగా వున్నాయి ఆమె సినిమాలు చూస్తుంటే.

tamannaahlatestpica.jpg

రజినీకాంత్ నటించిన 'జైలర్' సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించింది తమన్నా. ఆ సినిమాలో వచ్చిన 'నువ్వు కావాలయ్యా ...' అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ పాటలో తమన్నా తన అందాలతో కుర్రకారుని మత్తెక్కించింది అని చెప్పాలి. ఒక్క సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ అక్కడ కూడా బిజీ అయిపొయింది.

tamannaahlatestpicture.jpg

'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ లో తమన్నా ఒక కథలో కనిపిస్తుంది. 'సెక్స్ విత్ ఎక్స్' అనే ఈ భాగంలో తమన్నా శాంతి అనే అమ్మాయిగా నటించి ప్రసంశలు అందుకుంది. ఆమెకి జోడీగా ఇందులో విజయ్ వర్మ నటించాడు. అయితే అదే విజయ్ వర్మతో తను రిలేషన్ షిప్ లో వున్నాను అని చెప్పకనే చెప్పింది తమన్నా. వీరిద్దరూ కలిసి చాలా సార్లు ఫొటోలకి పోజులు కూడా ఇచ్చారు, డిన్నర్ కి, లంచ్ కి కలిసి వెళ్లిన సందర్భాలు కూడా ఎన్నో వున్నాయి.

tamannaahlatestpic.jpg

ఇప్పుడు తెలుగులో 'ఓదెల 2' లో తమన్నా ప్రధాన పాత్ర పోషిస్తోంది. 'ఓదెల రైల్వే స్టేషన్' అనే సినిమా ఇంతకు ముందు ఓటిటి లో విడుదలై మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ఈ 'ఓదెల 2' వస్తోంది. అశోక్ తేజ ఈ సినిమాకి దర్శకుడు అయితే, ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ సినిమా కథని అందించడం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ వారణాసిలో మార్చి నెలలో ప్రారంభం అయింది. అలాగే ఇప్పుడు రెండు హిందీ సినిమాలతో పాటుగా, తమిళంలో కూడా సినిమా చేస్తోంది తమన్నా అని సమాచారం.

Updated Date - Jun 25 , 2024 | 02:05 PM