తమన్నా యాక్షన్‌

ABN , Publish Date - Jun 29 , 2024 | 03:27 AM

తమన్నా భాటియా, హెబ్బా పటేల్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘ఓదెల 2’. అశోక్‌ తేజ దర్శకత్వంలో డి. మధు నిర్మిస్తున్నారు. దర్శకుడు సంపత్‌నంది క్రియేట్‌ చేసిన ‘ఓదెల రైల్వే స్టేషన్‌’ చిత్రానికి ఇది సీక్వెల్‌....

తమన్నా యాక్షన్‌

తమన్నా భాటియా, హెబ్బా పటేల్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘ఓదెల 2’. అశోక్‌ తేజ దర్శకత్వంలో డి. మధు నిర్మిస్తున్నారు. దర్శకుడు సంపత్‌నంది క్రియేట్‌ చేసిన ‘ఓదెల రైల్వే స్టేషన్‌’ చిత్రానికి ఇది సీక్వెల్‌. భారీ బడ్జెట్‌తో, బహుభాషా చిత్రంగా మేకర్స్‌ రూపొందిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్‌ను చిత్రబృందం ప్రారంభించింది. కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. టాప్‌ క్లాస్‌ యాక్షన్‌ డైరెక్టర్స్‌ పోరాట ఘట్టాలను అద్భుతంగా రూపొందిస్తున్నారనీ, తమన్నా యాక్షన్‌ పార్ట్‌ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారని మేకర్స్‌ తెలిపారు. వశిష్ట ఎన్‌ సింహ, నాగమహేశ్‌, గగన్‌ విహారి కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అజనీష్‌ లోకనాథ్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: సౌందర్‌ రాజన్‌ ఎస్‌.

Updated Date - Jun 29 , 2024 | 03:27 AM