ప్రతిభావంతుడు ఎన్టీఆర్‌తో...

ABN , Publish Date - Jun 23 , 2024 | 06:43 AM

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, సుధాకర్‌ మిక్కిలినేని...

ప్రతిభావంతుడు ఎన్టీఆర్‌తో...

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్‌ ఇందులో కథానాయికగా నటిస్తుండగా, సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ‘దేవర పార్ట్‌ 1’ సెప్టెంబర్‌ 27న విడుదలవుతోంది. ఈ సినిమాలోని ఓ పాటకు ‘వార్‌’, ‘పఠాన్‌’ సినిమాల ఫేమ్‌.. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ బోస్కో మార్టిస్‌ నృత్యరీతుల్ని సమకూరుస్తున్నారు. థాయిలాండ్‌లో ప్రస్తుతం ఆ పాట షూటింగ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో తీసుకున్న ఫొటోను ఆయన షేర్‌ చేస్తూ.. ‘‘అత్యద్భుతమైన ప్రతిభావంతుడు ఎన్టీఆర్‌తో పనిచేయడం ఎంతో ఆనందాన్నిస్తోంది’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

Updated Date - Jun 23 , 2024 | 06:43 AM