మొయినుద్దీన్‌గా తలైవా..

ABN , Publish Date - Jan 10 , 2024 | 03:39 AM

కులాలకు, మతాలకు, జాతులకు, ప్రాంతాలకు అతీతమైనవి క్రీడలు. అలాంటి క్రీడలకు మత మౌఢ్యాన్ని అద్ది.. లేనిపోని వివాదాలకు తెరలేపుతూ పెడత్రోవ తొక్కుతున్న కొందరు యువకులను సన్మార్గంలో నడిపించి...

మొయినుద్దీన్‌గా తలైవా..

కులాలకు, మతాలకు, జాతులకు, ప్రాంతాలకు అతీతమైనవి క్రీడలు. అలాంటి క్రీడలకు మత మౌఢ్యాన్ని అద్ది.. లేనిపోని వివాదాలకు తెరలేపుతూ పెడత్రోవ తొక్కుతున్న కొందరు యువకులను సన్మార్గంలో నడిపించి, వారిలో సఖ్యతను కుదిర్చే ఓ వ్యక్తి కథే ‘లాల్‌ సలామ్‌’. ఇందులో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మొయినుద్దీన్‌ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ముంబై నేపథ్యంలో నడిచే సినిమా ఇది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకురాలు. సుభాస్కరన్‌ నిర్మాత. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈ పాన్‌ఇండియా సినిమాకు సంబంధించిన రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. బ్లాక్‌బాస్టర్‌ ‘జైలర్‌’ తర్వాత వస్తున్న తలైవా సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని విభిన్న పాత్రను ఇందులో రజనీ చేసున్నారని మేకర్స్‌ చెబుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ ఇందులో ప్రత్యేక పాత్ర పోషిస్తుండటం విశేషం. జీవితా రాజశేఖర్‌, సెంథిల్‌, తంబి రామయ్య, అనంతిక, వివేక్‌ ప్రసన్న, తంగదురై తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విష్ణు రంగస్వామి, సంగీతం: ఏ.ఆర్‌.రెహమాన్‌.

లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ 171వ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. విశేషమేమిటంటే.. తలైవా 172కు కూడా రంగం సిద్థమైంది. కర్ణన్‌, మామన్నన్‌ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న మారి సెల్వరాజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. లోకేశ్‌ కనకరాజ్‌ సినిమా నిర్మాణం పూర్తికాగానే, ఈ సినిమా షూటింగ్‌ మొదలవుతుంది.

Updated Date - Jan 10 , 2024 | 03:39 AM