నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా
ABN , Publish Date - Nov 06 , 2024 | 03:19 AM
తెలుగు ప్రజలను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను.. ప్రతి ఒక్కరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఉపసంహరించుకుంటున్నట్టు సినీనటి కస్తూరి తెలిపారు. ‘ఈ నెల 3న తెలుగు ప్రజలను ఉద్దేశించి...
తెలుగు ప్రజలను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను.. ప్రతి ఒక్కరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఉపసంహరించుకుంటున్నట్టు సినీనటి కస్తూరి తెలిపారు. ‘ఈ నెల 3న తెలుగు ప్రజలను ఉద్దేశించి నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను. ఆ రోజున నేను మాట్లాడిన ముఖ్యమైన అంశం ఈ వివాదంతో మరుగునపడిపోయింది. రెండు రోజులుగా నాకు అనేక బెదిరింపులు వస్తున్నాయి. ఇవి సమస్యను మరింత తీవ్రతరం చేసేలా ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మనదేశంలో నేను నిజమైన జాతీయవాదిని. కులమత, ప్రాంతీయభేదాలకు దూరంగా ఉండే నేను తెలుగు ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉన్నాను. ఇది నాకు లభించిన మహాభాగ్యంగా భావిస్తాను.
నాయకర్‌లు, కట్టబొమ్మన్‌ల పేరు ప్రఖ్యాతులు, త్యాగరాజ కీర్తనలను వింటూ పెరిగాను. నా తెలుగు సినీ ప్రయాణాన్ని ఎంతగానో గౌరవిస్తాను. తెలుగు ప్రజలు నాకు పేరు ప్రఖ్యాతులతోపాటు మంచి ప్రేమాభిమానాలను కూడా పంచారు’ అని మంగళవారం ‘ఎక్స్’లో ఆమె పేర్కొన్నారు. కాగా, చెన్నై ఎగ్మోర్ పోలీ్‌సస్టేషన్‌లో ఆమెపై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
చెన్నై (ఆంధ్రజ్యోతి)