మా నాన్నలాగా నన్నూ ఆదరించండి

ABN , Publish Date - May 26 , 2024 | 05:59 AM

తమిళ దర్శకుడు విక్రమన్‌ తనయుడు విజయ్‌ కనిష్క హీరోగా నటించిన ‘హిట్‌ లిస్ట్‌’ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. సూర్య కతిర్‌ కాకల్లర్‌, కె కార్తికేయన్‌ సంయుక్త దర్శకత్వంలో దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌...

మా నాన్నలాగా నన్నూ ఆదరించండి

తమిళ దర్శకుడు విక్రమన్‌ తనయుడు విజయ్‌ కనిష్క హీరోగా నటించిన ‘హిట్‌ లిస్ట్‌’ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. సూర్య కతిర్‌ కాకల్లర్‌, కె కార్తికేయన్‌ సంయుక్త దర్శకత్వంలో దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. యాక్షన్‌ , సస్పెన్స్‌, క్రైమ్‌ జానర్‌లో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ శుక్రవారం జరిగింది. ఇందులో ముఖ్య అతిధిగా పాల్గొన్న మురళీమోహన్‌ మాట్లాడుతూ ‘నాకు బాగా సన్నిహితుడైన రవికుమార్‌ ఈ సినిమాకు నిర్మాత కావడం మంచి విషయం. హీరోగా విజయ్‌ కనిష్క సక్సెస్‌ కావాలి’ అని కోరారు. ‘పుదు వసంతం’ చిత్రం నుంచి దర్శకుడు విక్రమన్‌తో తనకు పరిచయం ఉందనీ, ఆయన తనయుడిని హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉందని కె.ఎస్‌.రవికుమార్‌ చెప్పారు. ‘మా నాన్న తెలుగులో చేసిన తొలి సినిమా ‘వసంతం’. ఆయనని ప్రోత్సహించినట్లే హీరోగా నన్ను ఆశీర్వదించండి’ అన్నారు విజయ్‌ కనిష్క. తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉందని శ్రీనివాస్‌ గౌడ్‌, బెక్కం రవీంద్ర చెప్పారు.

Updated Date - May 26 , 2024 | 05:59 AM