సస్పెన్స్‌ థ్రిల్లర్‌

ABN , Publish Date - Jun 20 , 2024 | 02:17 AM

ప్రవీణ్‌ కేవీ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మహిష’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను నటుడు శ్రీకాంత్‌ విడుదల చేసి...

సస్పెన్స్‌ థ్రిల్లర్‌

ప్రవీణ్‌ కేవీ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మహిష’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను నటుడు శ్రీకాంత్‌ విడుదల చేసి, టీమ్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్‌ కూడా పాల్గొన్నారు. ‘ఈ సందర్భంగా ప్రవీణ్‌ మాట్లాడుతూ ‘ఇది సస్పెన్స్‌ థ్రిల్లర్‌. నూతన నటీనటులు నటించారు. సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. శ్రీవెంకట్‌ సంగీతం అందించారు. త్వరలో పాటలను విడుదల చేస్తాం’ అని చెప్పారు. పృథ్వీ, యశిక, వైష్ణవి, కపిల్‌, మౌనిక, దీపు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సతీశ్‌, వివేక్‌.

Updated Date - Jun 20 , 2024 | 02:17 AM