‘భీమ’లో సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌

ABN , Publish Date - Mar 05 , 2024 | 02:32 AM

‘గోపీచంద్‌ ఇంతకుముందు చాలా పోలీస్‌ పాత్రలు చేశారు. కానీ ‘భీమ’లో పాత్ర విభిన్నంగా ఉంటుంది. కొత్త జానర్‌లో ఉండే కథ ఇది. ఇలాంటిది గోపీచంద్‌ కూడా చేయలేదు. ఇందులో సర్‌ప్రైజింగ్‌...

‘భీమ’లో సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌

‘గోపీచంద్‌ ఇంతకుముందు చాలా పోలీస్‌ పాత్రలు చేశారు. కానీ ‘భీమ’లో పాత్ర విభిన్నంగా ఉంటుంది. కొత్త జానర్‌లో ఉండే కథ ఇది. ఇలాంటిది గోపీచంద్‌ కూడా చేయలేదు. ఇందులో సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌ చాలా ఉన్నాయి. సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది. పోలీస్‌ గెటప్‌ కాకుండా ఇందులో గోపీచంద్‌ మరో గెటప్‌ కూడా ఉంది. అదేమిటనేది మార్చి 8న తెలుస్తుంది’ అని చెప్పారు నిర్మాత కె.కె. రాధామోహన్‌. కన్నడ దర్శకుడు ఎ.హర్ష దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా ఆయన నిర్మించిన ‘భీమ’ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్బంగా ఆయన సోమవారం మీడియాతో ముచ్చటిస్తూ ‘బాలకృష్ణ గారి ‘అఖండ’ చిత్రానికి మా సినిమాకీ ఏ మాత్రం పోలిక లేదు. బెంగళూరు, బాదమి పరిసర ప్రాంతాల్లో ఉండే పరశురామ క్షేత్రంలో జరిగే కథ ఇది. శివాలయం, అఘోరాలను యాంబియన్స్‌ కోసం చూపించాం. అఘోరాలకు ఈ కథతో సంబంథం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. దర్శకుడు హర్షను తెలుగు తెరకు పరిచయం చేయడం గురించి వివరిస్తూ ‘ముందు మనం కథని నమ్మాలి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కథ ఉందా లేదా అని చూడాలి. దానికి తగ్గ నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎన్నుకోవాలి. హర్ష చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. తను కొరియోగ్రాఫర్‌ కూడా. మా ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రానికి వర్క్‌ చేశారు. ‘భీమ’ని అద్భుతంగా తీశారు. రెండు పాటలకు కొరియోగ్రఫీ కూడా చేశారు’ అన్నారు.

సినిమా బడ్జెట్‌ పెరగడానికి కారణం చెబుతూ ‘మంగులూరు, బదామిచ ఉడిపి, మారేడుమిల్లి, వైజాగ్‌.. ఇలా చాలా ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. అన్నపూర్ణ స్టూడియోలో టెంపుల్‌ సెట్‌ వేశాం. కథకు తగ్గట్లుగా ఎక్కడా రాజీ పడకుండా తీశాం. దీని వల్ల బడ్జెట్‌ పెరిగింది. అయినా బిజినెస్‌ పరంగా హ్యాపీగా ఉన్నాం. పెద్ద సంఖ్యలో విడుదల చేస్తున్నాం. గోపీచంద్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ రిలీజ్‌ ఇది’ అని చెప్పారు రాధామోహన్‌. తన కొత్త సినిమాల గురించి చెబుతూ ‘ఆయుష్‌ శర్మ హీరోగా ఓ హిందీ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఏప్రిల్‌ 25న విడుదల చేస్తాం. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, విజయ్‌ కనకమేడల కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉంది’ అన్నారు.

Updated Date - Mar 05 , 2024 | 02:32 AM