రవితేజకు శస్త్ర చికిత్స
ABN , Publish Date - Aug 24 , 2024 | 06:53 AM
హీరో రవితేజ కుడిచేతికి సర్జరీ జరిగింది. చికిత్స చేసిన వైద్యులు ఆయనని ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ‘ఆర్‌టీ75’ సినిమా చిత్రీకరణలో
హీరో రవితేజ కుడిచేతికి సర్జరీ జరిగింది. చికిత్స చేసిన వైద్యులు ఆయనని ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ‘ఆర్‌టీ75’ సినిమా చిత్రీకరణలో రవితేజకు ఇటీవలే స్వల్ప గాయమైంది. ఆ గాయాన్ని లెక్కచేయకుండా షూటింగ్‌లో పాల్గొన్నారు. దాంతో ఆ గాయం మరింత పెద్దదవ్వడంతో డాక్టర్లు సర్జరీ చేశారు. కాగా, ‘సామజవరగమన’ చిత్రానికి రచయితగా పనిచేసిన భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.