మా మనవడినీ ఆదరించండి

ABN , Publish Date - Sep 27 , 2024 | 01:57 AM

సుదర్శన్‌ పరుచూరి హీరోగా పరిచమయవుతున్న ‘మిస్టర్‌ సెలబ్రిటీ’ చిత్రం అక్టోబర్‌ 4న విడుదల కానుంది. రవికిశోర్‌ దర్శకత్వంలో చిన్న రెడ్డయ్య, ఎన్‌.పాండురంగారావు నిర్మించారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌, నాజర్‌, రఘుబాబు ఇతర....

సుదర్శన్‌ పరుచూరి హీరోగా పరిచమయవుతున్న ‘మిస్టర్‌ సెలబ్రిటీ’ చిత్రం అక్టోబర్‌ 4న విడుదల కానుంది. రవికిశోర్‌ దర్శకత్వంలో చిన్న రెడ్డయ్య, ఎన్‌.పాండురంగారావు నిర్మించారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌, నాజర్‌, రఘుబాబు ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ సినిమా రిలీజ్‌ పోస్టర్‌ను పరుచూరి గోపాలకృష్ణ విడుదల చేసి ‘మమ్మల్ని ఆదరించినట్లుగానే మా మనవడు సుదర్శన్‌ను ఆదరించాలని కోరుతున్నా. కొత్త దర్శకుడైనా రవికిశోర్‌ సినిమా బాగా తీశాడు’ అని అభినందించారు. పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ‘మమ్మల్ని నలభై ఏళ్లుగా ఆదరిస్తున్నారు. మా మనవడు సుదర్శన్‌ ‘మిస్టర్‌ సెలబ్రిటీ’ హీరోగా మీ ముందుకు వస్తున్నాడు. తనని ఆశీర్వదించి, సినిమాను హిట్‌ చేయండి’ అని కోరారు.

Updated Date - Sep 27 , 2024 | 01:57 AM