సన్నీ యాక్షన్‌ మోడ్‌

ABN , Publish Date - Oct 20 , 2024 | 02:10 AM

బాలీవుడ్‌ హీరో సన్నీడియోల్‌ కథానాయకుడిగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై....

బాలీవుడ్‌ హీరో సన్నీడియోల్‌ కథానాయకుడిగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. సన్నీడియోల్‌ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్‌ సినిమా టైటిల్‌ను ప్రకటించి, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చే శారు. ‘జాత్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శరీరమంతా రక్తపుధారలు కారుతుండగా, పెద్ద ఫ్యాన్‌ను పట్టుకొని యాక్షన్‌ మోడ్‌లో ఉన్న సన్నీడియోల్‌ లుక్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. రణ్‌దీప్‌ హుడా, వినీత్‌కుమార్‌ సింగ్‌, సయామీ ఖేర్‌, రెజీనా కసాండ్రా కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: థమన్‌ ఎస్‌, సినిమాటోగ్రఫీ:రిషి పంజాబీ.

Updated Date - Oct 20 , 2024 | 02:10 AM