సుందరం మాస్టారి కథ

ABN , Publish Date - Jan 02 , 2024 | 05:06 AM

హర్ష చెముడు, దివ్య శ్రీపాద ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘సుందరం మాస్టారు’. కల్యాణ్‌ సంతోష్‌ దర్శకత్వంలో రవితేజ, సుధీర్‌ కుమార్‌ కుర్రు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదల...

సుందరం మాస్టారి కథ

హర్ష చెముడు, దివ్య శ్రీపాద ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘సుందరం మాస్టారు’. కల్యాణ్‌ సంతోష్‌ దర్శకత్వంలో రవితేజ, సుధీర్‌ కుమార్‌ కుర్రు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదల కానుంది. ఇంతవరకూ కమెడియన్‌గా మెప్పించిన హర్ష ఈ సినిమాలో తొలిసారిగా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా సుందరం మాస్టారు అటెండెన్స్‌ ప్రోమోను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ సినిమా ఎంత వినోదభరితంగా ఉంటుందనేది ఈ ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ ‘సుందరం అనే ప్రభుత్వ టీచర్‌ చుట్టూ తిరిగే కథ ఇది. మిర్యాల మెట్ట అనే మారుమూల పల్లెలో ఇంగ్లీషు టీచర్‌గా వెళ్లిన సుందరం దగ్గరకి ఎటువంటి విద్యార్థులు వస్తారు, వారికి అతను ఇంగ్లీషు ఎలా నేర్పించాడు అనే అంశాలను వినోదభరితంగా చెప్పాం.’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, సినిమాటోగ్రఫీ: దీపక్‌ ఎరెగడ.

Updated Date - Jan 02 , 2024 | 05:06 AM