సుందరకాండ సందడి

ABN , Publish Date - Apr 18 , 2024 | 06:50 AM

త్వరలోనే ‘ప్రతినిధి 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు నారా రోహిత్‌. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా నటిస్తున్న మరో చిత్రం...

సుందరకాండ సందడి

త్వరలోనే ‘ప్రతినిధి 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు నారా రోహిత్‌. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా నటిస్తున్న మరో చిత్రం నుంచి స్పెషల్‌ అప్‌డేట్‌ వచ్చింది. వెంకటేశ్‌ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం చేస్తూ, సంతోష్‌ చిన్నపొళ్ల, గౌతమ్‌ రెడ్డి, రాకేశ్‌ మహంకాళి నిర్మిస్తున్న చిత్రానికి ‘సుందరకాండ’ అనే టైటిల్‌ను మేకర్స్‌ ఖరారు చేశారు. అలాగే సెప్టెంబర్‌ 6న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీరామనవమి సందర్భంగా ‘సుందరకాండ’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. వృతి వాఘని ఈ చిత్రంలో కథానాయిక . శ్రీదేవి విజయ్‌కుమార్‌, నరేశ్‌ విజయ కృష్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: ప్రదీప్‌ ఎం. వర్మ

Updated Date - Apr 18 , 2024 | 06:50 AM