వేసవిలో అలరించే భరతనాట్యం

ABN , Publish Date - Apr 01 , 2024 | 01:50 AM

సూర్య తేజ ఏలే కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘భరతనాట్యం’. ‘దొరసాని’ ఫేమ్‌ కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. పాయల్‌ సరాఫ్‌ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. ఏప్రిల్‌ 5న ఈ చిత్రం విడుదలవుతోంది...

వేసవిలో అలరించే భరతనాట్యం

సూర్య తేజ ఏలే కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘భరతనాట్యం’. ‘దొరసాని’ ఫేమ్‌ కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. పాయల్‌ సరాఫ్‌ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. ఏప్రిల్‌ 5న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఆనంద్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘కేవీ మహేంద్రగారి ‘దొరసాని చిత్రం మా అందరికీ మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు ఈ ‘భరతనాట్యం’ చిత్రం సూర్యతేజతో పాటు యూనిట్‌కు గొప్ప గుర్తింపు తెస్తుంది’ అన్నారు. కేవీఆర్‌ మహేంద్ర మాట్లాడుతూ ‘‘దొరసాని’ విజయం పునరావృతమౌతుంది. సినిమా ఆధ్యంతం కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది. ‘భరతనాట్యం’ ఈ వేసవిలో ప్రేక్షకులను అలరిస్తుంది’ అని చెప్పారు. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా క్వాలిటీతో సినిమాను నిర్మించారని సూర్య తేజ తెలిపారు.

Updated Date - Apr 01 , 2024 | 01:50 AM