Sohail Khan : స్టైలిష్ లుక్‌లో సోహైల్‌ఖాన్
ABN , Publish Date - Dec 21 , 2024 | 03:42 AM
నందమూరి కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఎన్‌కేఆర్ 21’ (వర్కింగ్ టైటిల్). ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం
నందమూరి కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఎన్‌కేఆర్ 21’ (వర్కింగ్ టైటిల్). ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. కల్యాణ్‌రామ్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ ఈ చిత్రంతో నటుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఈవిల్డోర్ అనే విలన్ పాత్రలో ఆయన కల్యాణ్‌రామ్‌తో తలపడనున్నారు. శుక్రవారం సోహైల్‌ఖాన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. నల్లటి దుస్తుల్లో స్టైలిష్ లుక్‌లో సోహైల్‌ఖాన్ కనిపించారు. ఈ చిత్రంలో విజయశాంతి, సాయీ మంజ్రేకర్, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: అజనీష్ లోకనాథ్, సినిమాటోగ్రఫీ: రామ్ ప్రసాద్.