పోరాటాలే ఈ స్థాయికి చేర్చాయి
ABN, Publish Date - Oct 20 , 2024 | 02:11 AM
బుల్లి తెరపై నట ప్రస్థానం ఆరంభించి.. ఆ తర్వాత వెండితెరపై నటించిన ఐదో చిత్రంతోనే జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు మానసి పరేఖ్. ఇటీవల జరిగిన 70వ జాతీయ అవార్డుల్లో....
బుల్లి తెరపై నట ప్రస్థానం ఆరంభించి.. ఆ తర్వాత వెండితెరపై నటించిన ఐదో చిత్రంతోనే జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు మానసి పరేఖ్. ఇటీవల జరిగిన 70వ జాతీయ అవార్డుల్లో.. గుజరాతీ చిత్రం ‘కచ్ ఎక్స్‌ప్రె్‌స’తో ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకొని టాక్ ఆఫ్ ద నేషన్‌గా నిలిచారు. ఇటీవలే ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన ఆమె.. తన కెరీర్ తొలి రోజులను గుర్తుచేసుకున్నారు.
‘‘మనం చేసే పోరాటాలే మనమేంటో ప్రపంచానికి తెలియజేస్తాయి. నేను ఎన్నో పోరాటాలు చేసి కష్టపడ్డాను కాబట్టే.. ఈ స్థాయికి చేరుకోగలిగానని నమ్ముతాను. కష్టాల తర్వాత వచ్చే విజయంలో ఉండే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. అదొక అనిర్వచనీయమైన అనుభూతి. అప్పుడే ప్రతి క్షణాన్ని ఆస్వాదించగలుగుతాం. మనపై మనకు నమ్మకం ఉంటేనే ఏదైనా సాధించగలం’’ అని చెప్పారు.