మేజర్ వరదరాజన్ కథ
ABN , Publish Date - Oct 08 , 2024 | 02:05 AM
శివ కార్తీకేయన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘అమరన్’ చిత్రం నుంచి తొలి పాట ‘హే రంగులే’ను హీరో నితిన్ విడుదల చేశారు. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, రమ్య బెహర పాడారు...
శివ కార్తీకేయన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘అమరన్’ చిత్రం నుంచి తొలి పాట ‘హే రంగులే’ను హీరో నితిన్ విడుదల చేశారు. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, రమ్య బెహర పాడారు. శివ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్’ అనే పుస్తకంలోని ‘మేజర్ వరదరాజన్’ కథ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సుధాకరరెడ్డి, నిఖితా రెడ్డి ఈ నెల 31న తెలుగులో విడుదల చేస్తున్నారు.