హేమను దూషించడం ఆపాలి

ABN , Publish Date - May 26 , 2024 | 06:01 AM

బెంగుళూరు రేవ్‌ పార్టీలో పోలీసులకు దొరికిన వారిలో టాలీవుడ్‌ నటి హేమ కూడా ఒకరు. ఆ పార్టీలో తాను పాల్గొనలేదని ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా.. చివరకు పోలీసులు నిర్వహించిన డ్రగ్స్‌ టెస్టులో ఆమె బ్లడ్‌ శాంపిల్స్‌లో పాజిటివ్‌ వచ్చిన...

హేమను దూషించడం ఆపాలి

బెంగుళూరు రేవ్‌ పార్టీలో పోలీసులకు దొరికిన వారిలో టాలీవుడ్‌ నటి హేమ కూడా ఒకరు. ఆ పార్టీలో తాను పాల్గొనలేదని ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా.. చివరకు పోలీసులు నిర్వహించిన డ్రగ్స్‌ టెస్టులో ఆమె బ్లడ్‌ శాంపిల్స్‌లో పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో పెద్ద దుమారమే చెలరేగింది. ఆమెపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. ఆమె భవితవ్యం ఏంటని ఓ వైపు అంతటా చర్చ నడుస్తుంటే.. మరోవైపు ‘మా’ (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) ఆమెపై చర్యలు తీసుకోబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్న వేళ.. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ‘‘ఇటీవల రేవ్‌పార్టీకి సంబంధించిన కేసులో కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు నటి హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ధ్రువీకరించని సమాచారాన్ని ఇలా వ్యాప్తి చేయడం మానుకోవాలని ప్రతీ ఒక్కరిని నేను కోరుతున్నాను. రూమర్స్‌ ఆధారంగా ఆమెను దూషించడం అన్యాయం. ‘మా’ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను వ్యతిరేకిస్తుంది. హేమకు సంబంధించిన కచ్చితమైన సాక్ష్యాధారాలు పోలీసులు అందిస్తే, అప్పుడు ‘మా’ తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటుంది. అప్పటి వరకు నిరాధారమైన వార్తలను ప్రచారం చేయొద్దని కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు.

Updated Date - May 26 , 2024 | 06:01 AM