Siddharth Roy : చెన్నైలో ఉండి బతికిపోయాడు

ABN , Publish Date - Feb 23 , 2024 | 03:49 AM

‘సిద్ధార్థ్‌రాయ్‌’ చిత్రం షూటింగ్‌ నిర్ణీత సమయంలోనే పూర్తి చేశాం. కానీ సంగీత దర్శకుడు రధన్‌ వల్ల పోస్ట్‌ ప్రొడక్షన్‌ ఆలస్యమైంది. అవుట్‌ పుట్‌ విషయంలో నన్ను బాగా విసిగించాడు. తనతో చాలా విషయాల్లో...

Siddharth Roy : చెన్నైలో ఉండి బతికిపోయాడు

‘సిద్ధార్థ్‌రాయ్‌’ చిత్రం షూటింగ్‌ నిర్ణీత సమయంలోనే పూర్తి చేశాం. కానీ సంగీత దర్శకుడు రధన్‌ వల్ల పోస్ట్‌ ప్రొడక్షన్‌ ఆలస్యమైంది. అవుట్‌ పుట్‌ విషయంలో నన్ను బాగా విసిగించాడు. తనతో చాలా విషయాల్లో వాగ్వివాదం జరిగింది. తను మంచి టెక్నీషియనే కానీ నన్ను మానసికంగా చిత్రవధ చేశాడు. చెన్నైలో ఉండి బతికిపోయాడు. లేకుంటే పెద్ద గొడవే జరిగేది. ఇలాంటి సంగీత దర్శకులకు తెలుగు చిత్ర పరిశ్రమ దూరంగా ఉండాలి’ అని దర్శకుడు వీ యశస్వి విజ్ఞప్తి చేశారు. ఆయన దర్శకత్వంలో దీపక్‌ సరోజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సిద్ధార్థ్‌ రాయ్‌’. జయ అడపాక, ప్రదీప్‌ పూడి, సుధాకర్‌ బోయిన సంయుక్తంగా నిర్మించారు. నేడు ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం చిత్రబృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా యశస్వి మాట్లాడుతూ ‘సుకుమార్‌గారికి ఈ సినిమా బాగా నచ్చి, ‘నీ తర్వాత సినిమా నా బేనర్‌లోనే చేస్తున్నాం’ అని ప్రకటించారు. నేను ఊహించినదానికన్నా దీపక్‌ అద్భుతంగా నటించాడు. సిద్ధార్థ్‌రాయ్‌ ఒక డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. ఇలాంటి కథ, పాత్ర ఇప్పటివర కూ రాలేదు’ అని అన్నారు. దీపక్‌ సరోజ్‌ మాట్లాడుతూ ‘సిద్ధార్థ్‌రాయ్‌’ కథ విన్నాక ఆనందభాష్పాలు వచ్చాయి. నటుడిగా నన్ను నిరూపించుకోవచ్చని ఈ సినిమా చేశాను. ఈ సినిమా కోసం యశస్వి చాలా కష్టపడ్డారు. నా పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు. ఇందులో తన పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని కథనాయిక తన్వీ చెప్పారు.

Updated Date - Feb 23 , 2024 | 03:49 AM