షూటింగ్‌ మొదలుపెట్టారు

ABN, Publish Date - Jul 12 , 2024 | 01:38 AM

విక్టరీ వెంకటేశ్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ గురువారం మొదలైంది. వెంకటేశ్‌ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ హీరోయిన్లుగా...

విక్టరీ వెంకటేశ్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ గురువారం మొదలైంది. వెంకటేశ్‌ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ పోలీస్‌ ఆఫీసర్‌, ఆయన భార్య, మాజీ ప్రేయసి.. ఇలా మూడు పాత్రల చుట్టూ తిరిగే వినోద భరిత చిత్రమిదని, ఇందులో క్రైమ్‌ ఎలిమెంట్‌ కూడా మిళితమై ఉంటుందని దర్శకుడు అనిల్‌ రావిపూడి చెప్పారు. ప్రస్తుతం ప్రారంభమైన షూటింగ్‌లో చిత్రంలోని ముఖ్య తారాగణమంతా పాల్గొంటోంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత శిరీష్‌ చెప్పారు. దిల్‌ రాజు ఈ సినిమాకు సమర్పకుడు. ఈ చిత్రానికి సమీర్‌రెడ్డి ఛాయాగ్రాహకుడు, భీమ్స్‌ సిసిరోలియో సంగీత దర్శకుడు.

Updated Date - Jul 12 , 2024 | 01:38 AM