మారేడిమిల్లిలో మొదలైంది

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:26 AM

నిఖిల్‌ యోధుడి పాత్రను పోషిస్తున్న ‘స్వయంభూ’ చిత్రం తాజా షెడ్యూల్‌ మారేడుమిల్లిలో మొదలైంది. అక్కడున్న దట్టమైన అడవుల్లో నిఖిల్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు భరత్‌ కృష్ణమాచార్య. ఇది నిఖిల్‌కు...

మారేడిమిల్లిలో మొదలైంది

నిఖిల్‌ యోధుడి పాత్రను పోషిస్తున్న ‘స్వయంభూ’ చిత్రం తాజా షెడ్యూల్‌ మారేడుమిల్లిలో మొదలైంది. అక్కడున్న దట్టమైన అడవుల్లో నిఖిల్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు భరత్‌ కృష్ణమాచార్య. ఇది నిఖిల్‌కు 20వ సినిమా. ఆయన కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌లా నిలిచే విధంగా సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇందులో నిఖిల్‌ వారియర్‌గా నటిస్తుండడంతో ఇందుకోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారు. ఈ పీరియాడిక్‌ ఫిల్మ్‌లో సంయుక్త, నభా నటేశ్‌ హీరోయిన్లు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సెంథిల్‌ కుమార్‌, సంగీతం: రవి బస్రూర్‌, సహ నిర్మాతలు విజయ్‌ కామిశెట్టి, జీటీ ఆనంద్‌, నిర్మాతలు: భువన్‌, శ్రీకర్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు.

Updated Date - Jun 27 , 2024 | 12:26 AM