భారీసెట్‌ తో మొదలు

ABN , Publish Date - Oct 17 , 2024 | 05:40 AM

శర్వానంద్‌ కథానాయకుడిగా సంపత్‌ నంది దర్వకత్వంలో ఇటీవలే ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ‘శర్వా 38’ అనేది వర్కింగ్‌ టైటిల్‌. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బేనర్‌పై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు...

శర్వానంద్‌ కథానాయకుడిగా సంపత్‌ నంది దర్వకత్వంలో ఇటీవలే ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ‘శర్వా 38’ అనేది వర్కింగ్‌ టైటిల్‌. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బేనర్‌పై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోంది. 1960లో ఉత్తర తెలంగాణ, తెలంగాణ-మహరాష్ట్ర సరిహద్దుల్లోని గ్రామీణ నేపథ్యంలో కథ సాగుతుండడంతో ఆనాటి సంస్కృతిని ప్రతిబింబించేలా హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. 15 ఎకరాల విస్తీర్ణంలో భారీ వ్యయంతో ఆర్ట్‌ డైరెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ మన్నె ఈ సెట్‌ను రూపొందిస్తున్నారు. ఈ సెట్‌లో సినిమాకు కీలకమైన ఘట్టాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Oct 17 , 2024 | 05:40 AM