తిరుమలలో చిరంజీవి
ABN , Publish Date - Aug 22 , 2024 | 12:12 AM
మెగాస్టార్ చిరంజీవి శ్రీవారి దర్శనార్థం బుధవారం తిరుమలకు చేరుకున్నారు. రాత్రి 8గంటలకు తిరుమలలోని ఫీనిక్స్ అతిథిగృహానికి చేరుకున్న ఆయనకు టీటీడీ
కుటుంబ సభ్యులతో కలసి నేడు శ్రీవారి దర్శనం
తిరుమల, (ఆంధ్రజ్యోతి) : మెగాస్టార్ చిరంజీవి శ్రీవారి దర్శనార్థం బుధవారం తిరుమలకు చేరుకున్నారు. రాత్రి 8గంటలకు తిరుమలలోని ఫీనిక్స్ అతిథిగృహానికి చేరుకున్న ఆయనకు టీటీడీ రిసెప్షన్ అధికారులతో పాటు అభిమానులు స్వాగతం పలికారు. చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ, తల్లి అంజనాదేవి కూడా తిరుమలకు చేరుకున్నారు. అంతకుముందు సాయంత్రం కుమార్తె శ్రీజ కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో వేకువజామున జరిగే సుప్రభాతసేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకోనున్నారు.