శ్రీరంగనీతులు... కొత్తగా..

ABN , Publish Date - Apr 05 , 2024 | 03:16 AM

సుహాస్‌, కార్తీక్‌రత్నం, రుహానీ శర్మ, విరాజ్‌ అశ్విన్‌ ముఖ్య తారలుగా నటించిన ‘శ్రీరంగనీతులు’ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ప్రవీణ్‌కుమార్‌ దర్శకుడు. వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మించిన...

శ్రీరంగనీతులు... కొత్తగా..

సుహాస్‌, కార్తీక్‌రత్నం, రుహానీ శర్మ, విరాజ్‌ అశ్విన్‌ ముఖ్య తారలుగా నటించిన ‘శ్రీరంగనీతులు’ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ప్రవీణ్‌కుమార్‌ దర్శకుడు. వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు ధీరజ్‌ మొగిలినేని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఆసక్తికరమైన కథ, కథనాలు ఉన్నాయి. కొత్తదనంతో పాటు కమర్షియల్‌ అంశాలతో చిత్రం రూపుదిద్దుకొంది’ అని తెలిపారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా చూడలేదని సెన్సార్‌ సభ్యులు అభినందించడం ఆనందాన్ని కలిగించిందని దర్శకుడు చెప్పారు.

Updated Date - Apr 05 , 2024 | 03:16 AM