అందరికీ నచ్చే శ్రీరంగ నీతులు

ABN , Publish Date - Mar 30 , 2024 | 04:46 AM

సుహాస్‌, కార్తిక్‌ రత్నం, విరాజ్‌ అశ్విన్‌, రుహాని శర్మ ముఖ్య పాత్రలు పోషించిన ‘శ్రీరంగ నీతులు’ చిత్రం వచ్చే నెల 11న విడుదల కానుంది. పంపిణీదారుడు, నిర్మాత ధీరజ్‌ మొగిలి ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు...

అందరికీ నచ్చే శ్రీరంగ నీతులు

సుహాస్‌, కార్తిక్‌ రత్నం, విరాజ్‌ అశ్విన్‌, రుహాని శర్మ ముఖ్య పాత్రలు పోషించిన ‘శ్రీరంగ నీతులు’ చిత్రం వచ్చే నెల 11న విడుదల కానుంది. పంపిణీదారుడు, నిర్మాత ధీరజ్‌ మొగిలి ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. శుక్రవారం జరిగిన ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో నిర్మాత చిత్ర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ‘దర్శకుడు ప్రవీణ్‌కుమార్‌ నా స్నేహితుడు. సినిమా బాగా తీశాడు. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అన్నారు. తనకు నచ్చిన పాత్ర ఇందులో చేశానని కార్తిక్‌ రత్నం చెప్పారు. ‘మంచి కథతో తీసిన సినిమాలో నేను నటించినందుకు ఆనందంగా ఉంది’ అని విరాట్‌ అశ్విన్‌ చెప్పారు. ‘ఇదొక ఆంథాలజీ. ప్రవీణ్‌ చాలా కష్టపడ్డాడు. నిర్మాత చక్కని అభిరుచితో ఈ సినిమా తీశాడు’ అన్నారు సుహాస్‌.

Updated Date - Mar 30 , 2024 | 04:46 AM