ఐఫా వేదికపై శ్రీలీల మెరుపులు

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:20 AM

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినీ రంగప్రవేశం చేసి అనతికాలంలోనే అగ్ర హీరోలతో జతకట్టే స్థాయికి చేరారు నటి శ్రీలీల. ‘పెళ్లి సందడి’, ‘ధమాకా’, ‘స్కంద’ ‘గుంటూరు కారం’, ‘ఎక్ట్‌ట్రార్డినరీ మ్యాన్‌’ వంటి చిత్రాలతో వరుసగా సందడి చేసిన ఈ భామ...

ఐఫా వేదికపై శ్రీలీల మెరుపులు

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినీ రంగప్రవేశం చేసి అనతికాలంలోనే అగ్ర హీరోలతో జతకట్టే స్థాయికి చేరారు నటి శ్రీలీల. ‘పెళ్లి సందడి’, ‘ధమాకా’, ‘స్కంద’ ‘గుంటూరు కారం’, ‘ఎక్ట్‌ట్రార్డినరీ మ్యాన్‌’ వంటి చిత్రాలతో వరుసగా సందడి చేసిన ఈ భామ జోరు ఇటీవల బాగా తగ్గింది. నటిగా కంటే మంచి డాన్సర్‌గా ఎక్కువ పేరు తెచ్చుకున్న ఈ నాజూకు భామకు ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. అయితే అది సినిమాలో కాదు. దుబాయ్‌లో సెప్టెంబరులో జరిగే ఐఫా ఉత్సవాలలో డాన్స్‌ పెర్ఫార్మెన్స్‌ ఇవ్వనున్నారు శ్రీలీల. మంచి డ్యాన్సర్‌గా పేరొందిన ఈ నటి ఐఫా వేదికపై తన మెరుపులతో ప్రేక్షకులను రంజింపచేయనున్నారు. అలాగే ఇటీవలే పెళ్లి చేసుకున్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కూడా తన నృత్యంతో ప్రేక్షకుల మతిపోగొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇలా ఈ ఇద్దరు భామలు ఐఫా వేదికకు సరికొత్త అందం ఇవ్వనున్నారు. ఈ వేడుకలో రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ కూడా భాగం కానున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో.. తెలుగు వేడుకలకి దగ్గుబాటి రానా ..మిగతా విభాగాలకు అకుల్‌ బాలాజీ, విజయ్‌ రాఘవేంద్ర వాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు.

Updated Date - Apr 16 , 2024 | 03:20 AM