బాలీవుడ్‌లోకి శ్రీలీల

ABN , Publish Date - Jun 25 , 2024 | 01:05 AM

క్యూట్‌ బ్యూటీ శ్రీలీల బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు. డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వంలో వరుణ్‌ధావన్‌ నటించబోయే చిత్రానికి శ్రీలీలను ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉన్న...

బాలీవుడ్‌లోకి శ్రీలీల

క్యూట్‌ బ్యూటీ శ్రీలీల బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు. డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వంలో వరుణ్‌ధావన్‌ నటించబోయే చిత్రానికి శ్రీలీలను ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ చిత్రాన్ని జూలై నుంచి సెట్స్‌పైకి తీసుకువెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. కథాంశంగా ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీని ఎంచుకున్నారని.. కన్‌ఫ్యూజన్‌, కామెడీ కలగలసిన ఈ చిత్రం ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించేలా ఉంటుందట. టైటిల్‌, ఇతర తారాగణం, సాంకేతిక సిబ్బంది ఇంకా ఖరారు కాని ఈ చిత్రాన్ని రమేశ్‌ తౌరని నిర్మించనున్నారు. ఇటువంటి క్రేజీ ప్రాజెక్ట్‌తో బాలీవుడ్‌లోకి ఎంటర్‌ అవుతున్నందున.. ఇక బీ టౌన్‌లో కూడా ఆమె కెరీర్‌కు ఢోకా ఉండదని అంటున్నారు. డేవిడ్‌ ధావన్‌, వరుణ్‌ ధావన్‌ కలయికలో ఇదివరకు ‘మై తేరా హీరో’, ‘జుడ్వా 2’ చిత్రాలు వచ్చి.. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి.

Updated Date - Jun 25 , 2024 | 01:05 AM