RAM: ‘రామ్’ నుండి ‘మనతోని కాదురా బై’ పాట విడుదల.. ఎవరు రిలీజ్ చేశారంటే?

ABN , Publish Date - Jan 06 , 2024 | 09:11 PM

యదార్థ ఘటనల ఆధారంగా ‘రామ్’ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రం రాబోతోంది. రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని మేకర్స్ రెడీ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ‘మనతోని కాదురా బై’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

RAM: ‘రామ్’ నుండి ‘మనతోని కాదురా బై’ పాట విడుదల.. ఎవరు రిలీజ్ చేశారంటే?
Ram Movie Still

యదార్థ ఘటనల ఆధారంగా ‘రామ్’ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రం రాబోతోంది. రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని మేకర్స్ రెడీ చేస్తున్నారు. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా రామ్‌ (RAM) సినిమా తెరకెక్కుతోంది. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల (Surya Ayyalasomyajula) హీరోగా పరిచయం కాబోతున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్నారు. (Rapid Action Mission)

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా.. రీసెంట్‌గా రాహుల్ సిప్లిగంజ్ పాడిన దేశ భక్తి గీతం అందరిలోనూ ఉత్తేజాన్ని నింపింది. ఇక ఇప్పుడు కాస్త రొమాంటిక్ టచ్ ఉన్న పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విడుదల చేసి చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ‘మనతోని కాదురా బై’ (Manthoni Kadu Ra Bhai) అంటూ సాగే ఈ పాటకు.. రాము కుమార్ ఏఎస్‌కే సాహిత్యం, ధనుంజయ్ గాత్రం, ఆశ్రిత్ అయ్యంగార్ బాణీ ఇలా అన్నీ కలిసి మాంచి రొమాంటిక్ ఫీల్ ఇస్తున్నాయి.


Srikanth.jpg

కమర్షియల్, యాక్షన్, పేట్రియాటిక్ జానర్లో రాబోతోన్న ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తుండగా.. ధారణ్ సుక్రి డిఎసి సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Director Vijay Binni: ‘నా సామిరంగ’లో చాలా సర్‌ప్రైజ్‌లున్నాయ్..

**************************

*RC16: ఆయనే.. అధికారికంగా ప్రకటించేశారు

***********************

*Nawazuddin Siddiqui: విక్టరీ వెంకటేష్ నుండి అందరూ అది నేర్చుకోవాలి

****************************

*Dhanush: సోషల్‌ మీడియాతో జర జాగ్రత్త!

****************************

Updated Date - Jan 06 , 2024 | 09:14 PM