శ్రీదేవి కపూర్ చౌక్
ABN , Publish Date - Oct 14 , 2024 | 02:04 AM
దివంగత నటి శ్రీదేవి జ్ఞాపకార్థం ముంబైలోని ఓ రహదారి కూడలికి ఆమె పేరు పెట్టారు. శ్రీదేవి తుదిశ్వాస విడిచే వరకూ లోఖండ్‌వాలా ప్రాంతంలో నివసించారు....
దివంగత నటి శ్రీదేవి జ్ఞాపకార్థం ముంబైలోని ఓ రహదారి కూడలికి ఆమె పేరు పెట్టారు. శ్రీదేవి తుదిశ్వాస విడిచే వరకూ లోఖండ్‌వాలా ప్రాంతంలో నివసించారు. ఆమె అంతిమ యాత్ర కూడా ఈ రహదారి గుండానే సాగింది. ఈ నేపథ్యంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లోఖండ్‌వాలా కాంప్లెక్స్ ఏరియాలోని ముఖ్య కూడలికి శ్రీదేవి కపూర్ చౌక్ అని పేరు పెట్టింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని శనివారం శ్రీదేవి భర్త బోనీకపూర్, కూతురు ఖుషీకపూర్ ఆవిష్కరించారు.