Roti Kapda Romance: ఎమోష‌న‌ల్ డోస్ పెంచిన శ్రీవిష్ణు

ABN , Publish Date - Mar 09 , 2024 | 09:34 PM

ఎన్నో యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. తాజాగా ఈ చిత్ర ప్రీ ట్రైలర్‌ను హీరో శ్రీవిష్ణు విడుదల చేశారు.

Roti Kapda Romance: ఎమోష‌న‌ల్ డోస్ పెంచిన శ్రీవిష్ణు
Roti Kapda Romance Pre Trailer Launch

ఎన్నో యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ (Bekkem Venugopal).. సృజన్‌ కుమార్ బొజ్జం (Srujan Kumar Bojjam)తో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’ (Roti Kapda Romance). హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి (Vikram Reddy) దర్శకుడు. ఏప్రిల్ 12న ఈ చిత్రం విడుదలకాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ చిత్ర ఎమోష‌న‌ల్ డోస్ ప్రీ ట్రైల‌ర్‌ను యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీ‌విష్ణు చేతులమీదుగా మేకర్స్ విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా శ్రీవిష్ణు (Sree Vishnu) మాట్లాడుతూ.. నేను ఈ బ్యాన‌ర్‌ను ఎంతో ల‌క్కీగా ఫీల‌వుతాను. ఈ సంస్థ‌తో నాకున్న అనుబంధం అలాంటిది. ఈ టీమ్‌ను చూస్తుంటే నేను ఈ బ్యాన‌ర్‌లో చేసిన సినిమా రోజులు గుర్తుకు వ‌స్తున్నాయి. ఈ చిత్ర టీజ‌ర్‌, ఈ ఎమోష‌న‌ల్ టీజ‌ర్‌, పాట చూస్తుంటే యూత్‌కు బాగా క‌నెక్ట్ అయ్యే సినిమాలా అనిపిస్తుంది. ఈ సినిమా ఈ వేస‌వికి పెద్ద హిట్ అవుతుంద‌ని అనిపిస్తుంది. అంద‌రూ ఏప్రిల్ 12న ఈ సినిమాను చూసి ఆద‌రించాలని కోరుకుంటున్నాను. మ‌ళ్లీ స‌క్సెస్‌మీట్‌లో క‌లుద్దామని అన్నారు. (Roti Kapda Romance Pre Trailer Launched)


Sree-Vishnu.jpg

నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. అంద‌రం క‌ష్ట‌ప‌డి ధైర్యంగా ఈ సినిమా చేశాం. కంటెంట్‌ను న‌మ్మి చేసిన సినిమా ఇదని తెలపగా.. మ‌రో నిర్మాత సృజన్‌ కుమార్ బొజ్జం మాట్లాడుతూ.. క‌థ‌ను న‌మ్మి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చేసిన సినిమా ఇది. అంద‌రూ ఎంజాయ్ చేసే కంప్లీట్ ఎమోష‌న‌ల్ విత్ ఫ‌న్ రైడ్‌గా ఉంటుందని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. కొత్త వాళ్ల‌తో ఇలాంటి సినిమా తీయ‌డం ఓ మిరాకిల్‌. నా క‌థ‌ను న‌మ్మి ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌కు, నిర్మాత సృజన్‌ కుమార్ బొజ్జంకు థ్యాంక్స్‌. మాకు ఈ టైటిల్ ఇచ్చి ఎంక‌రైజ్ చేస్తున్న దిల్ రాజుగారికి కూడా రుణ‌ప‌డి వుంటామని తెలిపారు. (#RotiKapdaRomance)


ఇవి కూడా చదవండి:

====================

*Shambho Mahadeva: మణిశర్మ మెప్పు పొందిన వర్ధమాన గాయని.. ఎవరంటే?

************************

*Keerthi: మహిళలపై అరాచకాలు జరుగుతుంటే దేవుడెక్కడ? అంటూ నటి సంచలన వ్యాఖ్యలు

*******************************

*Odela 2: శివశక్తిగా తమన్నా భాటియా.. ఫస్ట్ లుక్ ఇదే..

****************************

Updated Date - Mar 09 , 2024 | 09:34 PM