భార్యాభర్తల ఈగోల గోల

ABN , Publish Date - May 16 , 2024 | 05:23 AM

రాహుల్‌ విజయ్‌, శివానీ జంటగా నటించిన ‘విద్య వాసుల అహం’ వెబ్‌ సిరీస్‌ ఈ నెల 17న ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోంది. మణికాంత్‌ గిల్లి దర్శకత్వంలో మహేశ్‌ దత్తా, లక్ష్మి నవ్య నిర్మించారు..

భార్యాభర్తల ఈగోల గోల

రాహుల్‌ విజయ్‌, శివానీ జంటగా నటించిన ‘విద్య వాసుల అహం’ వెబ్‌ సిరీస్‌ ఈ నెల 17న ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోంది. మణికాంత్‌ గిల్లి దర్శకత్వంలో మహేశ్‌ దత్తా, లక్ష్మి నవ్య నిర్మించారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు మాట్లాడుతూ .. కొత్తగా పెళ్లయిన విద్య, వాసు అహంకారాన్ని వీడి తమ కాపురాన్ని ఎలా చక్కదిద్దుకున్నారనే ఇతివృత్తంతో సిరీస్‌ను రూపొందించినట్లు చెప్పారు. ఇది కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అనీ, ఇందులోని నాలుగు పాటలను నాలుగు రకాలుగా సంగీత దర్శకుడు కల్యాణీ మాలిక్‌ కంపోజ్‌ చేశారని తెలిపారు. హీరోయిన్‌ శివానీని కూడా ఆయనే రికమెండ్‌ చేశారని మణికాంత్‌ గిల్లి చెప్పారు.


హీరో రాహుల్‌ మాట్లాడుతూ ‘ఇదొక క్యూట్‌ ఈగోస్‌ ఫన్‌ ఫిల్మ్‌. హాయిగా ఫ్యామిలీతో కలసి చూస్తూ ఎంజాయ్‌ చెయ్యవచ్చు’ అన్నారు.

‘ఈ టీమ్‌తో నాకు రెండేళ్ల నుంచి అనుబంధం ఉంది. దర్శకుడు మణికాంత్‌ కథ చెప్పగానే హీరో ఎవరని అడిగాను. రాహుల్‌ విజయ్‌ అని చెప్పగానే హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. ఈ ప్రాజెక్ట్‌ ఒప్పుకొన్న వారం రోజులకి ‘కోట బొమ్మాళి’ చిత్రం ఓకే అయింది. అలా రెండేళ్లుగా రాహుల్‌తోనే వర్క్‌ చేస్తున్నాను. ఏ మాత్రం ఈగో లేని వ్యక్తి’ అని శివానీ చెప్పారు.

Updated Date - May 16 , 2024 | 05:23 AM