కెరీర్‌లో స్పెషల్‌ ప్రాజెక్ట్‌

ABN , Publish Date - May 17 , 2024 | 02:38 AM

కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌ పోషించిన ‘సత్యభామ’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. నవీన్‌చంద్ర కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు సుమన్‌ చిక్కాల దర్శకుడు...

కెరీర్‌లో స్పెషల్‌ ప్రాజెక్ట్‌

కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌ పోషించిన ‘సత్యభామ’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. నవీన్‌చంద్ర కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు సుమన్‌ చిక్కాల దర్శకుడు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాతలు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో మ్యూజికల్‌ ఈవెంట్‌ను నిర్వహించి, అందులో ‘వెతుకు వెతుకు’ పాటను రిలీజ్‌ చేశారు. చంద్రబోస్‌ రాసిన ఈ పాటను సంగీత దర్శకుడు కీరవాణి పాడడం విశేషం. సంగీత దర్శకుడు శ్రీచరణ్‌ పాకాల తన టీమ్‌తో పాటలు పాడి హోరెత్తించారు. లైవ్‌ ఆర్కెస్ట్రాలో సింగర్స్‌ పాడిన పాటలకు ఈవెంట్‌కు హాజరైన ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేశారు. ఈ సందర్భంగా కాజల్‌ మాట్లాడుతూ ‘నా కెరీర్‌లో ‘సత్యభామ’ ఓ స్పెషల్‌ ప్రాజెక్ట్‌. ఇటువంటి పాత్ర చేయడం కెరీర్‌లో తొలిసారి. నేను ఓ బిడ్డకు జన్మ ఇచ్చిన తర్వాత నటించిన సినిమా ఇది. షీ సేఫ్‌ యాప్‌ను ఉపయోగించి సేఫ్‌గా ఎలా ఉండాలో చిత్రంలో చూపించాం. యువతులంతా క్షేమంగా ఉండాలనే కథలోని పాయింట్‌ నన్నెంతో ఆకట్టుకుంది.’ అన్నారు.

Updated Date - May 17 , 2024 | 02:38 AM