ఆశా పాదాలు కడిగిన సోనూ నిగమ్‌

ABN , Publish Date - Jun 30 , 2024 | 06:36 AM

బాలీవుడ్‌ చిత్రసీమలో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న మధుర గాయని ఆశా భోంస్లే. ఆ గానమాధుర్యానికి ఎన్నో పురస్కారాలు వశమయ్యాయి. ఆమె సంగీత ప్రయాణ ం ‘స్వరస్వామిని ఆశ’

ఆశా పాదాలు కడిగిన సోనూ నిగమ్‌

బాలీవుడ్‌ చిత్రసీమలో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న మధుర గాయని ఆశా భోంస్లే. ఆ గానమాధుర్యానికి ఎన్నో పురస్కారాలు వశమయ్యాయి. ఆమె సంగీత ప్రయాణ ం ‘స్వరస్వామిని ఆశ’ పేరుతో పుస్తకరూపంలోకి వచ్చింది. ఇటీవలే ముంబైలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన జరిగింది. ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్‌ ఆశా పాదాలను కడిగారు. ఆమె పట్ల తనకున్న ప్రేమ, గౌరవాలను అలా చాటుకున్నారు. ‘ఆశాజీ నుంచి చాలా నేర్చుకున్నాను. అందుకే ఆమెకు ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని సోనూ నిగమ్‌ చెప్పారు.

Updated Date - Jun 30 , 2024 | 06:36 AM