గురు ద్రోణాచార్య పుత్రుడను.. అశ్వత్థామను

ABN , Publish Date - Apr 22 , 2024 | 04:37 AM

అత్యున్నత సాంకేతిక హంగులతో పాన్‌ ఇండియా సినిమాగా ‘కల్కి 2898 ఏ.డీ’ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు...

గురు ద్రోణాచార్య పుత్రుడను.. అశ్వత్థామను

అత్యున్నత సాంకేతిక హంగులతో పాన్‌ ఇండియా సినిమాగా ‘కల్కి 2898 ఏ.డీ’ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పీరియాడికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌లో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనే, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదివారం అమితాబ్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం ఈ సినిమాలో ఆయన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను, క్యారెక్టర్‌ ఇంట్రడక్షన్‌ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ వీడియోలో ఒక బాలుడు, అమితాబ్‌ను ‘‘నీ పేరెంటి.. నీతో ఏ భాషలో మాట్లాడాలి.. నువ్వు చాలా బాగా ఫైట్స్‌ చేస్తున్నావ్‌, ఎవ్వరు నువ్వు’’ అని ప్రశ్నించగా.. ‘‘అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైంది. నేను కల్కి అవతారం కోసమే ద్వాపర యుగం నుంచి వేచి ఉన్నా.. నేను గురు ద్రోణాచార్యుడి పుత్రుడను.. అశ్వత్థామను’’ అని అమితాబ్‌ తన గురించి ఆ బాలుడికి చెప్తారు. ఈ గ్లింప్స్‌ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Apr 22 , 2024 | 04:37 AM