స్మైలీ బ్యూటీ

ABN , Publish Date - May 09 , 2024 | 06:31 AM

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు...

స్మైలీ బ్యూటీ

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ప్రేమకథా చిత్రమిది. గురువారం సాయిపల్లవి పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌ విడుదల చేశారు. నవ్వుతూ ఫోన్‌ మాట్లాడుతున్న సాయిపల్లవి ఆ పోస్టర్‌లో కనిపించారు. గురువారం ఆమె బర్త్‌డే స్పెషల్‌ వీడియో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. నాగచైతన్య ఇందులో జాలరిగా నటిస్తున్నారు. ఆ పాత్ర కోసం ఆయన పూర్తిగా మేకోవర్‌ అయ్యారు.

Updated Date - May 09 , 2024 | 06:31 AM