ఇస్మార్ట్‌... స్టెప్స్‌తో

ABN , Publish Date - Jun 29 , 2024 | 03:55 AM

రామ్‌ పోతినేని హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. ఆగస్టు 15న విడుదలవుతోంది. చిత్రబృందం సంగీత ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది...

ఇస్మార్ట్‌... స్టెప్స్‌తో

రామ్‌ పోతినేని హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. ఆగస్టు 15న విడుదలవుతోంది. చిత్రబృందం సంగీత ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ చిత్రం నుంచి తొలి గీతం విడుదలకు తేదీ ఖరారైంది. ‘స్టెప్పా మార్‌’ అంటూ సాగే ఈ మాస్‌ గీతాన్ని జూలై 1న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో శివుని విగ్రహం ముందు రామ్‌ పోతినేని డాన్‌ ్స చేస్తూ కనిపించారు. ఈ చిత్రంలో సంజయ్‌దత్‌ విలన్‌గా నటిస్తున్నారు. కావ్య థాపర్‌ కథానాయిక. అలీ, గెటప్‌ శ్రీను కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఛార్మీకౌర్‌తో కలసి పూరి జగన్నాథ్‌ నిర్మిస్తున్నారు. సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: సామ్‌ కే నాయుడు

Updated Date - Jun 29 , 2024 | 03:55 AM