నిదుర కుదురు చెదిరిపోయే
ABN , Publish Date - Sep 13 , 2024 | 04:37 AM
వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు సుహాస్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’...
వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు సుహాస్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’. సంగీర్తన కథానాయిక. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్‌రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వం వహించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 12న ఈ చిత్రం విడుదలవుతోంది. గురువారం చిత్రబృందం ‘నువ్వే నాకు లోకం... నిదుర కుదురు చెదిరిపోయే’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేసింది. దూరమైన భార్యను గుర్తు చేసుకుంటూ భర్త మనసు పడే బాధను వర్ణిస్తూ సాగే ఈ గీతానికి కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. విజయ్ బుల్గానిన్ స్వరాలు సమకూర్చారు. కార్తిక్ హృద్యంగా ఆలపించారు.