ఆరేళ్ల కష్టం భారతీయుడు 2

ABN , Publish Date - Jul 08 , 2024 | 06:10 AM

‘ఇండియన్‌ 2’ చిత్రం ఈ తరానికి నచ్చుతుంది. ఇది ప్రజల చిత్రం. 28ఏళ్ల తర్వాత మళ్లీ అదే పాత్ర, అదే దర్శకుడు నన్ను వెతుక్కుంటూ రావటం నా అదృష్టం. ఆరేళ్ల కష్టం ఈ సినిమా...

‘ఇండియన్‌ 2’ చిత్రం ఈ తరానికి నచ్చుతుంది. ఇది ప్రజల చిత్రం. 28ఏళ్ల తర్వాత మళ్లీ అదే పాత్ర, అదే దర్శకుడు నన్ను వెతుక్కుంటూ రావటం నా అదృష్టం. ఆరేళ్ల కష్టం ఈ సినిమా. ఇన్నేళ్లూ అభిమానులు నన్ను స్టార్‌గా నిలబెట్టారు. ఈ జన్మలో వారి రుణాన్ని తీర్చుకోలేను’ అని కమల్‌ హాసన్‌ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘భారతీయుడు 2’. 1996లో తెరకెక్కిన ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా శంకర్‌ దర్శకత్వం వహించగా, సుభాస్కరన్‌ నిర్మించారు. సిద్ధార్థ్‌, ఎస్‌.జే.సూర్య, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 12న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఆదివారం ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో మీకు కమల్‌ ఎక్కడా కనిపించడు. కేవలం ‘సేనాపతి’ మాత్రమే అందరికీ కనిపిస్తాడు’’ అని చెప్పారు. డైరెక్టర్‌ శంకర్‌ మాట్లాడుతూ ‘‘సినిమా సెట్‌లో కమల్‌ని సేనాపతిగా చూడగానే గూస్‌బంప్స్‌ వచ్చేవి. థియేటర్స్‌లో సినిమా చూసే ప్రేక్షకులకూ ఇదే ఫీలింగ్‌ కలుగుతుంది’’ అని అన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 06:10 AM