ఏడాదికి ఆరు చిత్రాలు

ABN , Publish Date - Jul 23 , 2024 | 05:52 AM

‘బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ అలీ రజా హీరోగా నటించిన ‘రామ్‌ ఎన్‌.ఆర్‌.ఐ.’ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. సీతా నారాయణన్‌ కథానాయిక. ‘పవర్‌ ఆఫ్‌ రిలేషన్‌షిప్‌’ అనేది ఉప శీర్షిక. ఎన్‌. లక్ష్మీ నందా దర్శకత్వంలో మువ్వా సత్యనారాయణ నిర్మించారు. ఆదివారం రాత్రి జరిగిన చిత్రం...

‘బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ అలీ రజా హీరోగా నటించిన ‘రామ్‌ ఎన్‌.ఆర్‌.ఐ.’ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. సీతా నారాయణన్‌ కథానాయిక. ‘పవర్‌ ఆఫ్‌ రిలేషన్‌షిప్‌’ అనేది ఉప శీర్షిక. ఎన్‌. లక్ష్మీ నందా దర్శకత్వంలో మువ్వా సత్యనారాయణ నిర్మించారు. ఆదివారం రాత్రి జరిగిన చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో చిత్ర సమర్పకుడు సింగులూరి మోహన్‌కృష్ణ మాట్లాడుతూ ‘సినిమా బాగా వచ్చింది. గోదావరి అందాలను అద్భుతంగా చూపించాం. ఈ నెల 26న విడుదల చేస్తున్నాం. ఇకపై ఏడాదికి ఆరు చిత్రాలైనా విడుదల చేయాలని నిర్ణయించుకున్నా. ప్రతి చిన్న చిత్రాన్నీ రిలీజ్‌ చేస్తా’ అని చెప్పారు.

Updated Date - Jul 23 , 2024 | 05:52 AM