ద్విభాషా చిత్రంలో శివరాజ్‌కుమార్‌

ABN , Publish Date - Jun 25 , 2024 | 12:52 AM

కన్నడ హీరో శివరాజ్‌కుమార్‌, ‘పాయుమ్‌ ఒలి నీ యెనక్కు’ ఫేమ్‌ కార్తీక్‌ అద్వైత్‌ దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించారు...

ద్విభాషా చిత్రంలో శివరాజ్‌కుమార్‌

కన్నడ హీరో శివరాజ్‌కుమార్‌, ‘పాయుమ్‌ ఒలి నీ యెనక్కు’ ఫేమ్‌ కార్తీక్‌ అద్వైత్‌ దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఎస్‌.ఎన్‌.సుధీర్‌రెడ్డి, పి.సుధీర్‌ నిర్మించనున్నారు. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్న ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టులో మొదలుపెట్టనున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: దీపు.ఎస్‌.కుమార్‌, సినిమాటోగ్రఫీ: ఎ.జె.శెట్టి, సంగీతం: సామ్‌.పీ.ఎస్‌.

Updated Date - Jun 25 , 2024 | 12:52 AM