అమరన్‌గా శివ కార్తికేయన్‌

ABN , Publish Date - Feb 18 , 2024 | 03:04 AM

తమిళ హీరో శివ కార్తికేయన్‌ హీరోగా కమల్‌హాసన్‌ నిర్మిస్తున్న చిత్రానికి ‘అమరన్‌’ అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌ను ఖరారు చేశారు. శనివారం శివ కార్తికేయన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం టైటిల్‌ను...

అమరన్‌గా శివ కార్తికేయన్‌

తమిళ హీరో శివ కార్తికేయన్‌ హీరోగా కమల్‌హాసన్‌ నిర్మిస్తున్న చిత్రానికి ‘అమరన్‌’ అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌ను ఖరారు చేశారు. శనివారం శివ కార్తికేయన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం టైటిల్‌ను ప్రకటించి, టీజర్‌ను విడుదల చేసింది. ఆర్మీ మేజర్‌ ముకుందవరదరాజన్‌ జీవితం ఆధారంగా రాహుల్‌ సింగ్‌, శివ్‌ అరూర్‌ రాసిన ‘ఇండియాస్‌ మోస్ట్‌ ఫియర్‌ లెస్‌’ సిరీ్‌సలోని ఓ అధ్యాయం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. సాయిపల్లవి కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: సీహెచ్‌ సాయి

Updated Date - Feb 18 , 2024 | 03:05 AM