సీట్‌ ఎడ్జ్‌లో కూర్చుని చూసేలా...

ABN , Publish Date - May 03 , 2024 | 05:22 AM

సినిమా సినిమాకు వైవిధ్యమైన రోల్స్‌ చేస్తూ సూపర్‌ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటున్నారు సుహాస్‌. ఆయన హీరోగా నటించిన యూనిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ప్రసన్న వదనం’ ...

సీట్‌ ఎడ్జ్‌లో కూర్చుని చూసేలా...

సినిమా సినిమాకు వైవిధ్యమైన రోల్స్‌ చేస్తూ సూపర్‌ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటున్నారు సుహాస్‌. ఆయన హీరోగా నటించిన యూనిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ప్రసన్న వదనం’ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ మూవీ గురించి సుహాస్‌ మీడియాతో ముచ్చటించారు. ‘‘ఇందులో ఆర్జే పాత్ర పోషించాను. ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ కారణంగా ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటాను, వాటి నుంచి ఎలా భయటపడతాననేదే ఈ సినిమా కథాంశం. అందరినీ అలరించే సినిమా ఇది. చాలా మంది నా కథల ఎంపిక బావుంటుందని మెచ్చుకుంటుంటారు. ఈ సినిమాను థియేటర్లలో చూస్తున్నప్పుడు కచ్చితంగా థ్రిల్‌ ఫీలవుతారు. సీట్‌ ఎడ్జ్‌లో కూర్చుని చూసేలా ఈ సినిమా సాగుతుంది. దర్శకుడు అర్జున్‌ వై.కెకు ఇది తొలి చిత్రం అయినా చాలా అనుభవం ఉన్నట్లు సినిమాను తెరకెక్కించారు’’ అని చెప్పారు.

Updated Date - May 03 , 2024 | 05:22 AM