ఒకే పాత్ర.. సామాజిక సందేశం

ABN , Publish Date - Feb 18 , 2024 | 03:02 AM

ఒకే పాత్రతో సామాజిక సందేశంతో రూపొందిన చిత్రం ‘నేటి భారతం’. భరత్‌ పారేపల్లి దర్శకత్వంలో డాక్టర్‌ యర్రా శ్రీధర్‌ రాజు నటిస్తూ ఈ సినిమాను నిర్మించారు. త్వరలో విడుదల కానుంది...

ఒకే పాత్ర.. సామాజిక సందేశం

ఒకే పాత్రతో సామాజిక సందేశంతో రూపొందిన చిత్రం ‘నేటి భారతం’. భరత్‌ పారేపల్లి దర్శకత్వంలో డాక్టర్‌ యర్రా శ్రీధర్‌ రాజు నటిస్తూ ఈ సినిమాను నిర్మించారు. త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ట్రైలర్‌ విడుదల చేశారు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత సాంబేష్‌ మాట్లాడుతూ ‘మంచి సినిమాలు చేయాలని శ్రీధర్‌ రాజు పరిశ్రమకు వచ్చారు. మొదటి ‘మేరా భారత్‌ మహాన్‌’ సినిమా తీశారు. ఇప్పుడు ఒకే పాత్రతో ‘నేటి భారతం’ తీశారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఈ సినిమా ద్వారా చూపించాం’ అని చెప్పారు. కరోనా తర్వాత వచ్చిన ఆర్థిక, సామాజిక స్థితిగతులపై ఈ సినిమా ఉంటుందని నిర్మాత, నటుడు శ్రీధర్‌ రాజు చెప్పారు. ఇందులో తను జర్నలిస్ట్‌ పాత్రను పోషించినట్లు తెలిపారు. జర్నలిస్టు అంకిత భావం, తెగింపు ఇందులో చూపించామని చెప్పారు.

Updated Date - Feb 18 , 2024 | 03:02 AM