శ్రీవారికి తలనీలాలు సమర్పించిన గాయని సుశీల

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:59 AM

సీనియర్‌ నేపథ్య గాయని పి. సుశీల మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆమె శ్రీవారికి తలనీలాలు సమర్పించి...

శ్రీవారికి తలనీలాలు సమర్పించిన గాయని సుశీల

సీనియర్‌ నేపథ్య గాయని పి. సుశీల మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆమె శ్రీవారికి తలనీలాలు సమర్పించి మంగళవారం ఉదయం ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూప్రసాదాలు అందజేశారు. ఆలయం ముందు సుశీలను చూసిన పలువురు అభిమానులు దగ్గరకు వెళ్లి పలకరించారు. కొందరు ఆమెతో సెల్ఫీలు తీసుకున్నారు. ఎన్నాళ్ల నుంచో స్వామి వారికి తలనీలాలు సమర్పించే మొక్కు ఉందనీ, ఇన్నాళ్లకు అది తీరిందని సుశీల చెప్పారు.

తిరుమల, (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jun 26 , 2024 | 05:59 AM