గాయని పి. సుశీలకు అస్వస్థత
ABN , Publish Date - Aug 18 , 2024 | 01:29 AM
ప్రముఖ గాయని పి. సుశీల శనివారం అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో ఆమె చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు...
ప్రముఖ గాయని పి. సుశీల శనివారం అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో ఆమె చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోంది. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కొంతకాలంగా సుశీల అనారోగ్యంతో బాధపడుతున్నారు.